Search
Wednesday 14 November 2018
  • :
  • :

అసభ్యకర సందేశాలతో ప్రొఫెసర్ వేధింపులు.. దేహశుద్ధి చేసిన విద్యార్థిని!

Professor of Government College for Girls in Patiala gets beaten up by students

పాటియాలా: అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్‌ను తోటి విద్యార్థులతో కలిసి కళాశాలలోనే దేహశుద్ధి చేసిందో విద్యార్థిని. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ మహిళా కళాశాలలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా బాధితురాలి మొబైల్‌కు ఓ ప్రొఫెసర్ అభ్యంతరకరమైన సందేశాలు పంపుతున్నాడు. అతగాడి వేధింపులను కొన్ని రోజులుగా భరిస్తున్న విద్యార్థిని ఇటీవల ఆ వేధింపులు మరింత ఎక్కువకాడంతో సహనం కోల్పోయింది. సదరు ప్రొఫెసర్‌ను తోటి విద్యార్థులు, మరో మహిళా ప్రొఫెసర్‌తో కలిసి నిలదీసింది. అనంతరం కళాశాలలోనే అందరూ చూస్తుండగానే దేహశుద్ది చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది.

Comments

comments