Home తాజా వార్తలు హైదరాబాద్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ లో కాల్పుల కలకలం

property dispute between brothers

సిటీబ్యూరోః సోదరుల మధ్య ఉన్న భూవివాదం కాల్పులకు దారితీసిన సంఘటన పేట్‌బషీరాబాద్, దేవరాంజియల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… దేవరాంజియల్‌కు చెందిన పిసారి నర్సింహారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి తన భూమిలో కనీలు నాటుతుండగా వేణుగోపాల్ రెడ్డి అక్కడికి వచ్చి అభ్యంతరం తెలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కనీలు ఎలా పాతుతున్నావని ప్రశ్నించడమే కాకుండా అసభ్యంగా దూషించాడు. అంతేకాకుండా మహిపాల్ రెడ్డిపై దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా కారులో ఉన్న గన్ తీసుకువచ్చి కాల్పులు జరపడంతో మహిపాల్ రెడ్డి త్రుటిలో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇద్దరి మధ్య గత కొంత కాలం నుంచి భూవివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి కాల్పులు జరిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వేణుగోపాల్ రెడ్డిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

property dispute between brothers