Home తాజా వార్తలు వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 21మంది అరెస్టు

వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 21మంది అరెస్టు

ARREST-2హైదరాబాద్: నగరంలోని నాచారం పరిధిలోగల పారిశ్రామిక వాడలో రహస్యంగా ఓ ముఠా నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరంపై ఎస్‌ఒటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకులతోపాటు 14 మంది విటులు, ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక రూ. పదివేల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఒటి ఎస్‌ఐ రాములు తెలిపారు.