Home తాజా వార్తలు బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం…!

బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం…!

Prostitution in the pursuit of Beauty Parlor : Vijayawada

అమరావతి: బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం కొనసాగుతుందని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విజయవాడలో గురువారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగర పరిధిలోని పలు బ్యూటీపార్లర్లలో నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లబ్బీపేట, గురునానక్‌కాలనీ, మొగల్రాజపురంలో నాలుగు బ్యూటీపార్లర్లలో దాడులు నిర్వహించిన సమయంలో క్రాస్‌ మసాజ్‌ జరుగుతోందని పోలీసులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం మహిళలకు మహిళలు, పురుషులకు పురుషులు మాత్రమే మసాజ్‌ చేయాలి. కానీ, ఈ పార్లర్లలో పురుషులకు యువతులు మసాజ్‌ చేస్తున్నారు. దీంతో ఇలా మసాజ్ చేయించుకున్న పలువురిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.