Home సూర్యాపేట అరుదైన వృక్షాన్ని సంరక్షించాలంటూ కలెక్టర్‌కు వినతి

అరుదైన వృక్షాన్ని సంరక్షించాలంటూ కలెక్టర్‌కు వినతి

 Protecting rare plant species

మనతెలంగాణ/కోదాడరూరల్: సృష్టిలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జంతు జాతులను సంరక్షిస్తూ జీవవైవిధ్య సమతుల్యతను సాధించేందుకు కృషిచేయాలని అరుదైన వృక్షం తరుఫున పర్యావరణపరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ సూర్యాపేటజిల్లాకలెక్టర్ సురేంద్రమోహన్‌ను కోరారు. మంగళవారం తమ్మరబండపాలెం గ్రామపరిధి లోని ఆశోక్‌నగర్ వద్ద రోడ్డువెంట ఉన్న అరుదైన వృక్షం అడన్‌సోనియా డిజిటెటా లిన్ (ఆఫ్రికన్ జాతివృక్షం) తెలుగులో బూరుగుమాను చెట్టుకి పూలమాల వేసి పర్యావరణ దీక్షను చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అరుదైన వృ క్షాన్ని గత ఆరుసంవత్సరాలక్రితమే గుర్తించి సంరక్షణచర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను, అధికారులను ఎ న్నోసార్లు పత్రికాముఖంగా ప్రత్యేక్షంగా కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా జిల్లాకలెక్టర్ స్పందించి అ త్యంత అరుదై న వృక్షాన్ని సంరక్షించేచర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. దానిప్రాముఖ్యతనుతెలుపుతూ పర్యాటకప్రదేశంగా మార్చాలని విద్యార్ధులు ప్లేకార్డులుప్రదర్శించారు. అనంతరం చెట్టుచుట్టూ ఉన్నాకంప, పిచ్చిమొక్కలను తొలగించి చెట్టుచుట్టూ పరిశుభ్రంగాచేశారు. ఈకార్యక్రమంలో సృజన, స ంధ్యారాణి, లక్ష్మి,బాలరాజు, రెడ్డి, తిరుపతిస్వామి, నరేష్, వీ రారాజు,  రవి, వైష్ణవి, పాల్గొన్నారు.