Home జాతీయ వార్తలు ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు(వీడియో)

ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు(వీడియో)

Protection-Forceశ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో భాగంగా తంగ్‌మార్గ్ ప్రాంతంలోని కొంచిపురా గ్రామంలో భద్రతా దళాలు ఓ ఇంటిని చుట్టుముట్టాయి. గురువారం రాత్రి నుంచే మిలిటెంట్లు ఫైరింగ్ చేశారు. అయితే ఇవాళ ఉదయం మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు తారస్థాయికి చేరాయి. ఇంట్లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు రక్షణ దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో బలగాలు ఎదురుకాల్పులు చేసి ముష్కరులు దాగి ఉన్న ఇంటిని పేల్చేశాయి.