Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిరసన

cong1.

మన తెలంగాణ/కౌడిపల్లి : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్‌కు గురిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మండల కేంద్రమైన కౌడిపల్లిలోని నర్సాపూర్ – మెదక్ ప్రధాన జాతీయ రహదారిపై మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునితలకా్ష్మరెడ్డి భారీగా కార్యకర్తలతో తరలివచ్చి రోడ్డుపై బైటాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సునితరెడ్డి మాట్లాడు తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అకారణంగా   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయడం సరికాదన్నారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి చేయని పథకాలు గవర్నర్ ప్రసంగంలో వినిపించడంతో వాటిని అసత్య ప్రచారాలుగా పరిగణించి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు. చిన్నపాటి అభ్యంతరానికే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు బూతద్దంలో చూస్తూ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో సస్పెన్షన్ వేటు వేయ డం జరిగిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయంలో అనేక మార్లు సభలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించిన చిన్న విషయంగానే పరిగణించి వదిలివేయడం జరిగిందన్నారు. వాటన్నింటిని మరిచి న టిఆర్‌ఎస్ పార్టీ నేడు కక్షసాధింపు చర్యగా సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ వేటును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటరి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సంతోష్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పా ర్టీ అధ్యక్షులు అల్మాయిపెట ఎల్లమ్, మాజీ సిడిసి చైర్మేన్ దుర్గారెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు బోయిని వీరయ్య, మైనార్టి సెల్ అధ్యక్షలు పాషా, ఎస్సీ సెల్ అధ్యక్షులు శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జీవన్‌గౌడ్, నాయకులు పుండరికంగౌడ్, కిషోర్‌గౌడ్, బత్తయ్య, జైశేఖర్, సంజీవ్‌రావు, వెం కటయ్య, శ్రీను, రాజు, ప్రవీణ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

comments