Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రేమికుల రోజును నిరసిస్తూ ఆందోళన

VHP

హైదరాబాద్ : ప్రేమికుల రోజును నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు బుధవారం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. అబిడ్స్ కూడలిలో ప్రేమికుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడిన యువత పెడదారిన పడుతున్నారని , ఈ క్రమంలోనే తాము ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నట్టు ఆందోళనకారులు తెలిపారు. ప్రేమికుల రోజును జరుపొద్దని వారు పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులను హెచ్చరించారు. తమ వ్యాపారం కోసమే బహుళ జాతి సంస్థలు ప్రేమికుల రోజును ప్రోత్సహిస్తున్నాయని వారు ఆరోపించారు.

Protest Against to Valentine’s Day

Comments

comments