Home అంతర్జాతీయ వార్తలు షరీఫ్ ప్రసంగంపై భారత్ నిరసన

షరీఫ్ ప్రసంగంపై భారత్ నిరసన

nawaz-sharif22వాషింగ్టన్: పాకిస్థాన్ మరోమారు ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేసిందని భారతదేశం విమర్శించింది. ఐరాస సర్వప్రతినిధి సభలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై ఐరాసలోని భారత కీలక ప్రతినిధి అభిషేక్ సింగ్ స్పందించారు. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చి అందుకు పాకిస్థాన్ ప్రతిఫలాన్ని అనుభవిస్తోందని సింగ్ తెలిపారు. ఉపఖండంలోని పరిస్థితులపై పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి దిగిందని, ఇందుకు మరో మారు ఐరాసను వేదికగా ఎంచుకోవడం అనుచితం అని సింగ్ విమర్శించారు. కశ్మీర్ అంశంపై భారత్ వైఖరికి సోషల్ మీడియాలో మద్దతు లభించింది. పాకిస్థాన్ అనుచిత వైఖరిని విడనాడి వెంటనే ఆక్రమిత కశ్మీర్ నుంచి వైదొల గడం మంచిదని భారతదేశం స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన పలువురు దౌత్యవేత్తలతో పాటు పాకిస్థాన్‌కు చెం దిన మాజీ దౌత్యవేత్త ఒకరు కూడా కశ్మీర్ అంశంపై పాక్ వైఖరి గురించి నిరసన వ్యక్తం చేశారు. తమ దేశ వైఖరి బాగా లేదని పాక్ మాజీ దౌత్యవేత్త ఒకరు. ఐరాస సర్వ ప్రతినిధి సభలో నవాజ్ షరీఫ్ ప్రసంగానికి సొంతదేశం పాక్‌లో మంచి స్పందన లభిస్తుందేమో కానీ, దీనిని ఇతర చోట్ల తేలిగ్గా తీసుకుంటారని ఈ దౌత్యవేత్త ట్వీట్ చేశారు.

ఇక షరీఫ్ చేసిన ప్రసంగంపై భారతదేశం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని, శాంతి సుస్థిరతల గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్న భారతదేశం ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకి స్థాన్ వెంటనే వైదొలగాలని స్పష్టం చేసింది. పిఓకె నుంచి పాక్ సైన్యం ఉపసంహరణ జరగడం మంచిదని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. షరీఫ్ వైఖరిని క్రమంగా పలు వర్గాలు ట్వీట్ల రూ పంలో విమర్శిస్తూ వస్తున్నారు. ప్రధాని షరీఫ్ ప్రసంగంలో స్పష్టత లేదని, ఓ వైపు ఆయన విదేశీ ఆక్రమణ సముచిత అంటారు అని, మరోవైపు స్వాధీనం చేసుకున్న వారిది తప్పని పేర్కొంటున్నారని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదా నికి కేంద్రంగా మారిందని, కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి సముచితంగా ఉందని ట్విట్టర్ వాడకందార్లు స్పంది స్తున్నారు.

ఐరాస వేదిక నుంచి ప్రధాని షరీఫ్ చేసిన ప్రకటన ఎలాంటి ప్రయోజనాలను అందించలేదని, దీనితో ఆయన ఏమి ఆశించారో తెలియడం లేదని అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా గతంలో పనిచేసిన హుస్సేన్ హఖ్ఖానీ స్పందించారు. సొంత ప్రజలను మెప్పించే ప్రసం గాల వరకు అయితే షరీఫ్ బాగానే మాట్లాడారని, కానీ ఇతర దేశాల స్పందన ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకం అని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రసంగాలను తాను చాలా విన్నానని స్పందించారు. ‘పాకిస్థాన్ ఓ ఉగ్రవాది, జిహాదీలను కశ్మీర్‌కు తరలిస్తున్న విఫల దేశం, ఏం చేస్తాం ఓ ఉగ్రవాద దేశం పొరు గు దేశంగా ఉండటం భారత్ చేసుకున్న పాపం’ అని టిఎస్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ నుంచి విముక్తం చేయా లని ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహిం చారని, భారత్ అనుకూల నినాదాలతో హోరెత్తించారని పవన్ దురానీ ట్విట్టర్‌లో తెలిపారు. షరీఫ్ ఐరాసలో మాట్లాడుతూ ఉండగా పాకిస్థాన్‌లో జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనపై నిరసన వ్యక్తం చేస్తూ బలోచ్ జాతీ యులు, ముతహిద క్వామీ మూవ్‌మెంట్ మద్దతుదార్లు తమ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.