Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఒకతరం చేసిన పనులు మరో తరానికి పునాదులు

– భవన నిర్మాణానికి నిధులు అందిస్తా
– ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
MLA

మన తెలంగాణ/సంగారెడ్డి అర్బన్ : ఒకతరం చేసిన మంచి పనులు మరో తరానికి పునాదు లవుతాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొ న్నారు. ఆదివారం సంగారెడ్డి మండల పరిధి లోని పోతిరెడ్డి పల్లిలోని పిఎస్‌ఆర్ గార్డెన్స్‌లో అల్లాదుర్గం సిటిజన్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటూ అందరు ఒక్క తాటిపైకి వచ్చి ఈ విధంగా ఓ సమ్మేళనం ఏర్పాటుచేయడం సంతోషకరమైన విషయమన్నారు. కాగా పోతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసముండే అల్లాదుర్గం ప్రాతం వారి కోసం భవన నిర్మాణం చేసుకోవడానికి ఎసిడిపి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. అంతకుముందు సిడిసిచైర్మన్ విజయేందర్‌రెడ్డి, జడ్పీటిసి మనోహర్‌గౌడ్, సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్ టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు మాట్లాడుతూ ఒక ప్రాంతానికి చెందిన వారంతా ఈ విధంగా ఒకేచోట చేరి సమ్మేళన కర్యాక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇతరులు కూడా ఈవిధమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. దీంతో ఒకరితో ఒకరికి ఆత్మీయతలు పెరిగి సమాజం అన్నివిధాలుగా అభివృధ్ది చెందే అవకాశం ఉంటుదని పేర్కొన్నారు. అంతకుముందు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే చేతులమీదుగా సన్మానం నిర్వహించారు. కార్యక్రమం లో సంఘం గౌరవ అధ్యక్షుడు సారా ప్రభాకర్‌గౌడ్, అధ్యక్షుడు రాంగారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి బాలయ్య, బత్తుల నాగయ్య, శేషాచారి, నారాయణ, అశోక్‌కుమార్, శ్రీనివాస్, ప్రశాంత్‌శర్మ, శ్రీనివాస్, క్రిష్ణమూర్తి, ప్రభాకర్, కోరబోయిన రవీందర్, రమేశ్, అశోక్, రవి, నర్సారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments