Home తాజా వార్తలు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి…

Welfare Schemes

 

వనపర్తి : సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామా రావును కలిసి పుష్పగుచ్చం అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటీవల జడ్పిచైర్మన్‌గా ఎన్నుకున్న ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ముని రొద్దిన్, ఉస్మాన్‌లు మంత్రుల ఆధ్వ ర్యంలో కెటిఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ లో ఇక ఎలాంటి ఎన్నికలు వచ్చిన కూడా టిఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించడం జరుగుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోవాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రజాప్రతినిధుల కృషి ఎంతో అవసరమన్నారు. అర్హులైన వారికి జులై 1 నుండి రెట్టింపు పథకాలు వర్తింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఎంఎల్‌ఎ హర్షవర్ధన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు గాడిల ప్రశాంత్ ఉన్నారు.

Provide Welfare Schemes to the Public