Home జాతీయ వార్తలు లాలూకు ప్రొవిజినల్ బెయిల్ మంజూరు…

లాలూకు ప్రొవిజినల్ బెయిల్ మంజూరు…

lalu-yadav

రాంచీ: పశు దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మెడికల్ గ్రౌండ్స్ కింద ఆరు వారాల బెయిల్  చేస్తున్నట్టు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం మంజూరు చేసింది. ఇప్పటికే పెరోల్ మీదా బిర్సా ముందా జైల్  నుంచి లాలూ విడుదలైన విషయం తెలిసిందే. లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ వివాహం నిమిత్తం ఆయనకు మూడు రోజుల పెరోల్ దొరికింది. బిర్సా ముందా జైలు నుంచి గురువారం సాయత్రం పాట్నా చేరుకున్నారు. తాజాగా లాలూకు ప్రొవిజినల్ బెయిల్ మంజూరైంది.  లాలూ ప్రసాద్ యాదవ్ తరుఫున న్యాయవాదులు అభిషేక్ మన్ సింఘ్వీ, ప్రభాత్ కుమార్ జార్ఖండ్ హై కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. దీంతో లాలూకు 12 వారాల ప్రొవిజినల్ బెయిల్ ఇవ్వాలని లాలూ తరుపు లాయర్లు తమ పిటిషన్ లో కోరారు. వారి విజ్ఞప్తి  మేరకు లాలూకు  ఆరు వారాల బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించింది.