Home అంతర్జాతీయ వార్తలు పీఎస్‌ఎల్‌వీ సి-29 కౌంట్‌డౌన్ ప్రారంభం

పీఎస్‌ఎల్‌వీ సి-29 కౌంట్‌డౌన్ ప్రారంభం

ROCKETశ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విదేశీ వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈనెల 16న పీఎస్‌ఎల్‌వీ సి-29 వాహననౌక ద్వారా సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం ఏడు గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో వాతావరణ పరిశీలనకు సంబంధించి 400 కిలోల టెలిమోస్ ఉపగ్రహం ఉంది. మిగిలిన అన్నీ నానో ఉపగ్రహాలే. ఆదివారం మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. ముందస్తు కౌంట్‌డౌన్ ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించారు. 59 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగియగానే బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళుతుందని సైంటిస్టులు వెల్లడించారు. సింగపూర్‌కు స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ అంతరిక్ష సంస్థ కోరిక మేరకు ఆరు ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి పంపనుంది. మొత్తం 625 కిలోల బరువు గల సింగపూర్ ఉపగ్రహాలతో సీఎస్‌ఎల్‌వీ సి -29 వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.