Search
Wednesday 14 November 2018
  • :
  • :

పిఎస్‌ఎల్‌వి-సి31 ప్రయోగం విజయవంతం

PSLV-C31శ్రీహరికోట: నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్(సతీష్ ధావన్ స్పేస్ సెంటర్) నుంచి బుధవారం ఉదయం 9:31 నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి సి31 వాహక నౌకను ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 9:31 మొదలై 48 గంటలపాటు నిరాంతరాయంగా సాగిన అనంతరం ఈ రోజు పిఎస్‌ఎల్‌వి సి31 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ పోలార్ షాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా 1425 కిలోల బరువు ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని శాస్త్రవేతలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చారు. నావిగేషన్ పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపుతున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగంతో గ్లోబల్ పొజిషినింగ్ వ్యవస్థ(జిపిఎస్) మరింత వేగవంతంగా పనిచేయనుంది. పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ఈ ప్రయోగం 33వ ప్రయోగం. అదేవిధంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో 5వ ఉపగ్రహం కావడం గమనార్హం. ఈ ప్రయోగం విజయవంత కావడంతో ఇస్రో శాస్త్రవేతలు 2016 యేడాదిలో మొదటి విజయాన్ని పిఎస్‌ఎల్‌వి సి31 అందిచిందని తెలిపారు. ఈ ఉపగ్రహం జీవిత కాలం 12 సంవత్సరాలు.

Comments

comments