Home సంగారెడ్డి సామాజిక సేవలో పిఎస్‌ఆర్ ఫౌండేషన్

సామాజిక సేవలో పిఎస్‌ఆర్ ఫౌండేషన్

PSR

మన తెలంగాన/మునిపల్లి : ఎన్ని ఉన్నా.. సహాయం చేసే స్వభావం ఉండాలి. అందరిలో ఒక గుర్తింపుగా నిలవాలన్న తపనతో మానవ సేవే.. మాధవ సేవ అన్న ధృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా సేవలో ముందుకు సాగుతోంది పిఆర్‌ఎస్ ఫౌండేషన్. ప్రజల నుంచి  మిన్నంటిన ప్రశంసలు వస్తున్నాయి. ఒకే చోట కాకుండా మండలంలో గ్రామ గ్రామాన తమ సేవలను అందజేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. పిఎస్‌ఆర్ ఫౌండేషన్ పైతర సాయికుమార్ యాదవ్ అనే పేరు ప్రజా సేవలో రాజీలేని పోరు అన్న తన ఆశయంతో ప్రజల్లోకి చొచ్చుకుపోయి తన సేవలను అందిస్తున్నారు. ఎవరేమన్నా తన సేవే లక్షంగా ముందుకు సాగుతున్నాడనే చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనం 2016లో ‘పిఎస్‌ఆర్’ ఫౌండేషన్ స్థాపింపజేసి వివిధ  సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించగా.. ఆయన  సేవల జ్ఞాపకాలకు గూడు కట్టుకుంటున్నాయి. కాగా నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రజల గొంతును తడపాలన్న లక్షంతో ట్రాక్టర్‌తో మంచినీటి సరఫరా చేసింది.  చదువుతున్న, చదువుకుంటున్న ప్రతి విద్యార్థి ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతుంటున్నారని ఉద్దేశ్యంతో విద్యార్థులు ఎలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి?, ఏం కోర్సుతీసుకుంటే ఏం జాబ్ వస్తుంది? తదితర వాటిపై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కల్పించి విద్యార్థులు, యువకులను చైతన్యవంతులను చేసేందుకు పిఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వ్యక్తిత్వ నిపుణులను తెప్పించి మండల పరిధిలోని బుదేరా ప్రభుత్వ కళాశాలలో  విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించారు. ఒక్కరితో ఏపనీ కాదు, పది చేతులు కలిపితేనే పనులు జరుగుతాయనే దృఢసంకల్పంతో  మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పిఎస్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులను  ఏర్పాటు చేశారు. సభ్యులకు పిఎస్‌ఆర్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యులకు అవగాహన కల్పించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులను తెప్పించి అవగాహనతోపాటు  హితబోధ చేయించారు. దసరా పండుగ అనగానే గుర్తొచ్చేది బంగారంతోపాటు ఒకరికొకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. దీంతో  మండలంలోని పోల్కలంపల్లి గ్రామ శివారులోని శ్రీసాయి గార్డెన్‌లో పండుగను పురస్కరించుకుని కులమతాలకతీతంగా అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  టిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాద వ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు క్రాంతికిరణ్‌తోపాటు వక్తలు పాల్గొని అలబ్‌బలయ్ కార్యక్రమంలో భాగంగా అలయ్‌బలయ్ తీసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదిలా ఉండ గా.. మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామంలో విగ్రహా ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీటిని అందించేందుకు ట్రాక్టర్‌తో నీటిని సరఫరా చేయించారు.  అదే గ్రామంలో మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించగా.. దీనికి పిఎస్‌ఆర్ ఫౌండేషన్ కొంత ఆర్థిక సహకారం కావాలని కోరగా.. ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంత ఆర్థ్ధిక సహాయాన్ని కూడా అందించి విద్యార్థులను అభినందించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్  పైతర సాయికుమార్ యాదవ్ సొంత గ్రామమైన ఖమ్మంపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు టై, బెల్టు, బ్యాచ్‌లను ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పంపిణీ చేశారు. కాగా అదే పాఠశాలలో బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుడు ఖమ్రోద్దీన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. పిఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేద విద్యార్థులకు ఫౌండేషన్ చేయూతనందించాలని కోరుకుందాం.