Home తాజా వార్తలు ఆరు కార్లను తగలబెట్టిన సైకో అరెస్టు

ఆరు కార్లను తగలబెట్టిన సైకో అరెస్టు

Car-in-fireహైదరాబాద్: ఆరు కార్లను తగలబెట్టిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతంలో ఆర్‌కె నగర్‌కు చెందిన రామ్ అయ్యర్ కన్నన్ వెంకటేష్‌ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. వెంకటేష్ తన తాతల కాలం నుంచి దర్జాగా బతికినట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ పెయింటర్ పని చేస్తూ, డబ్బులు లేక సైకో సాంబగా మారాడు. ఆరు కొత్త కార్లను తగులబెట్టానని నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రతి ఒక్కరు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నిందితులను పట్టుకోవడం సులభమవుతోందని పోలీసులు తెలిపారు.