Home రాష్ట్ర వార్తలు బంజారాహిల్స్‌లో సైకో వీరంగం

బంజారాహిల్స్‌లో సైకో వీరంగం

కత్తితో దాడి … నలుగురికి గాయాలు … ఒకరి మృతి … ఇద్దరి పరిస్థితి విషమం
PSICOమన తెలంగాణ / సిటీబ్యూరో : బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఎన్‌బిటినగర్‌లో నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ సైకో నలుగురు వ్యక్తుల పై కత్తితో దాడి చేసి వీరంగం సృష్టించా డు. ఈ ఘటనలో గాయపడ్డ హోటల్ కార్మికుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికి త్స పొందుతూ మృతి చెందగా మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సైకోను గుర్తించిన పోలీసులు అత ని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతోస్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి. బంజారాహిల్స్‌లోని సయ్యద్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ అర్బాస్ (32) మద్యం మత్తుకు అలవాటు పడ్డా డు. కొద్ది రోజుల నుంచి గంజాయికి కూడా అలవాటు పడినట్లు స్థానికులు చెప్పారు. నెల రోజుల నుంచి ఆటోను నడపడం కూడా మానివేశాడు. బస్తీలో వచ్చిపోయే వారితో తరచూ గొడవ పడు తున్నాడు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు సయ్యద్ అర్బాస్ ఎన్‌బిటినగర్ కు వచ్చాడు. చేతిలో పదునైన కత్తితో బయల్దేరిన అతగాడు ఆ బస్తీలో రోడ్డుపై వెళ్తున్న వారిపై ఆకస్మికంగా కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై వచ్చేవారిని బెదిరించ సాగా డు. అదే సమయంలో ఆ దారి వెంట వెళ్తున్న నలుగురు వ్యక్తులపై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఆ నలుగురు యువకు లు రక్తంమడుగులో పడి కొట్టుమిట్టాడుతు న్నా స్థానికులు కాపాడే ధైర్యం చేయలేక పోయాడు. కాపాడటానికి వచ్చిన వారిపై కూడా అర్బాస్ దాడి చేసేందుకు యత్నిం చగా వారు తప్పించుకున్నారు. చివరకు బస్తీవాసులందరు కేకలు వేసి, రాళ్లతో ఎదురు దాడికి దిగడంతో అర్బాస్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తంమడుగులో పడిన గుల్బర్గాకు చెందిన జానిమియా అలియాస్ బబ్లూ (18), యన్‌బిటినగర్‌కు చెందిన జగన్ (20)ను చికిత్స నిమిత్తం ఉస్మా నియా ఆసుపత్రికి తరలించగా, ఎన్‌బిటినగర్‌కు చెందిన బాలరాజు (26), మహేష్ (35)లను బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న సెం చురీ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఉస్మా నియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జానిమియా రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. అతని కడుపులో మూడు కత్తిపోట్లు కావడంతో రక్త స్త్రావం ఎక్కువగా జరగడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. కత్తి పోట్లకు గురైన జగన్‌కు డాక్టర్లు మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక సెంచూరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజు, మహేష్‌ల పరిస్థితి విషమంగా ఉంది. సైకోగా మారిన ఆటో డ్రైవర్ అర్బాస్ కత్తితో దాడి చేయడంతో తమవారు గాయపడ్డారని తెలు సుకున్న బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రి వద్దకు చేరు కోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెదిన జానిమియా ఇటీవలే గుల్బర్గా నుంచి వచ్చి ఎన్‌బిటినగర్‌లో ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తు ఇక్కడే నివా సముంటున్నాడు. జానిమియా మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారింట్లో విషాదఛా యలు అలుముకున్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ మురళి కృష్ణ స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైకోగా మారిన అ ర్బాస్‌ను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగా రు. ఇతని కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు నాలుగు గంటల పాటు గాలిస్తుండగా జూబ్లీహిల్స్‌లో మరోసారి అతగాడు దాడికి యత్ని స్తుండగా పసిగట్టినపోలీసులు అతన్ని చాకచక్యంతో పట్టుకున్నారు. అయితే తాను దాడికి ఎందుకు పాల్పడ్డానో తెలియదని నిందితుడు చెబు తున్నాడు. సైకోగా మారి ఈ దాడికి పాల్పడ్డాడా లేక దీని వెనకాల ఏదైనా కుట్ర గాని మనస్పదర్ధలు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన కత్తిని అతని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైకో అరెస్టు కావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.