Home తాజా వార్తలు ‘సైకో సయ్యాన్‌..’ ఫుల్ వీడియో వచ్చేసింది

‘సైకో సయ్యాన్‌..’ ఫుల్ వీడియో వచ్చేసింది

హైదరాబాద్‌: బాహుబలి సిరీస్ తర్వాత యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘సాహో’. యంగ్ డెరెక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తుంది. దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సాహో చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్.. మేకింగ్ వీడియోల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.కాగా, ఇటీవల ‘సైకో సయ్యాన్‌..’ అనే సాంగ్ టీజర్‌ను  విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సాంగ్ ఫుల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ పాటలో ప్రభాస్, శ్రద్ధ లుక్స్ సూపర్బ్. ముఖ్యంగా ప్రభాస్‌ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఓ పార్టీలో శ్రద్ధ మద్యం సేవిస్తూ ప్రభాస్‌తో కలిసి చిందులేస్తుంది.

ఈ పాటలో డ్యాన్సులతోపాటు తన అందంతో శ్రద్ధ ఆకట్టుకుంది. ఇక, ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.  ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 

Psycho saiyaan full song video released