Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్

m

సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘శివకాశీపురం’. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు హరీష్ వట్టికూటి మాట్లాడుతూ “ఇదొ క సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. విభిన్న కథాంశంతో రూపొందింది ఈ చిత్రం. మంచిర్యాల, కాజీపేట, గాంధారి ఖిల్లాలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి”అని తెలిపారు. రాజేష్ శ్రీచక్రవర్తి, ప్రియాంక శర్మ, చమ్మక్ చంద్ర, దిల్ రమే ష్, సూర్య, లక్ష్మీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః జయ జి.రామిరెడ్డి, సంగీతంః పవన్ శేషా, ఎడిటింగ్‌ః జియో థామస్, టి.రాము.

Comments

comments