Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం

Police-station

నిర్మల్ టౌన్: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల విభాగంతో పాటు తాగు నీటి సౌకర్యాం ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురి నుంచి ఆర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను విన్న అనంతరం సంబందిత పోలీసులకు వెంటనే చర్యలు తీసుకోని పూర్తి దర్యాప్తు చేసి నివేదికలు అందించాలని ఆదేశించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చే బాదితులకు అప్యాయంగా పలకరించి ముందుగా తాగు నీరు అందించాలని సూచించారు. రాత్రి సమయంలో గస్తీతో పాటు పెట్రోలింగ్, కాలనీల్లో అనుమానస్పదంగా వ్యక్తులు సంచరించినట్లయితే సంబందిత పోలీస్ స్టేషన్ ఎస్సై, సీఐలకు లేదా పోలీస్ వాట్స్‌ఆప్ నంబర్ 8333986939కు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండి పని చేయాలన్నారు. పోలీసులు ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.

Comments

comments