Home జనగామ ప్రజా ధనం స్వాహ చేస్తున్న: కాంట్రాక్టర్లు

ప్రజా ధనం స్వాహ చేస్తున్న: కాంట్రాక్టర్లు

cc-road-contract-image

మన తెలంగాణ/ జనగామ ప్రతినిధి: పట్టణ అభివృద్ధి కోసం బల్దియా కోట్లాది రూపాయలు ఖర్చుతో పనులు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఇంజనీరింగ్ శాఖ వారు సూచించిన నింబంధనలకు పాతరవేసి కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా రోడ్లు మురికి కాల్వలు పైపై మెరుగులతో పనులు చూపించి లక్షలాది రూపాయల ప్రజా ధనం స్వాహ చేస్తున్నారు. 20వ వార్డులో ఎబివి జూనియర్ కాలేజి నుండి సిపిఐ కార్యలయం వరకు సిసి రోడ్డు ను పరిశీలిస్తే భూమిపై కవర్లు పరిచి రోడ్డు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. బస్తీ వాసులు ఎవరు ప్రశ్నించిన వారి మాటలు భేఖతారు చేసి వాళ్ళపని వారు కానిస్తున్నారు. వీరి పనులపై అధికారు పర్యవీక్షణ కూడ లేదు. కాబట్టి పనులన్ని లోపభుయిష్టంగా సాగుతున్నాందున ఇట్టి పనులపై సదరు శాఖ అధికారులు నాణ్యతను పరిశీలించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బర్ల శ్రీరాములు బస్తీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.