Home వార్తలు ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కారం

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కారం

Public problems are readily solved

మన తెలంగాణ/ సూర్యాపేట : ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా నేటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తరలివచ్చిన ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామానికి చెందిన మహిళలు వివిధ సమస్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి ముందు విన్నవించగా స్పందించిన మంత్రి గ్రామంలో ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురా వాలన్నారు. సమస్యలను తక్షణమే తీర్చే విధంగా చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తి గత అదనపు కార్యదర్శి డిఎస్వీ శర్మ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కటికం శ్రీనివాస్ గౌడ్, పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా ప్రభాకర్ ఉన్నారు. పలువురి పరామర్శ : జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు గుడిపూడి వెంకటేశ్వరరావు అత్త, ఆత్మకూర్ మండలం ఇస్తా లపురం గ్రామానికి చెందిన గడ్డం అండమ్మల మృతిపట్ల మంత్రి తీవ్ర సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులను ఆది వారం పరామర్శించారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాకి కృపాకర్‌రెడ్డి, ఎంపిపిలు వట్టె జానయ్యయాదవ్, కసగాని లక్ష్మీ, తూడి నర్సింహరావు తదితరులు ఉన్నారు.