Home బిజినెస్ ఎస్‌బిఐ మినహా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలి

ఎస్‌బిఐ మినహా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలి

bs

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా పిఎస్‌యు బ్యాంకుల ప్రైవేటీ కరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిని ప్రైవేటీకరించాలని అన్నారు. 2019లో ప్రభుత్వ ఏర్పాటు చేయాల నుకునే రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలే ఈ ప్రతిపాదన చేర్చాలని సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13 వేల కోట్ల కుంభకోణంతో పాటు ఇటీవల బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి ప్రశ్నించగా పనగారియా ఈ విధంగా సమాధానమిచ్చారు. పనగారియా ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ఎకానమిక్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.  ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) పెరిగిపోవడం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి కుంభకోణాలు పిఎస్‌బి ల ప్రైవేటీకరణకు కారణమని అన్నారు. ‘2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలకుంటున్న రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్‌బిఐ మినహా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం చేర్చాలి’ అని తాను కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటురంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు.