Search
Sunday 18 November 2018
  • :
  • :

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం : చాడ

chada-venkareddyమన తెలంగాణ/కాప్రా : కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఇసిఐఎల్‌లోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో నిర్వహించిన సిపిఐ కాప్రా సర్కిల్ జనరల్‌బాడి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను భ్రష్ర్టుపట్టించడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడి ప్రభుత్వం బడా బాబులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. కార్పోరేట్ సంస్థలకు సంబంధించి 13లక్షల కోట్ల మొండి బకాయిలు బ్యాంకుల్లో పేరుకుపోయాయన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన మోడి ప్రభుత్వం ఇప్పటికైనా మారకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు కూడా ఇలాగే దాపురించిందని చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనాకర్షణ మోజులో పడ్డ సిఎం కెసిఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పరిపాలనపై లేదని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంతోషం ప్రజల్లో లేదని, కేవలం వారి కుటుంబసభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వి.ఎస్.బోస్, కాప్రా కార్యదర్శి లక్ష్మీనారాయణ, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments