Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం

man

*కేసిఆర్ ఆదేశాల మేరకు పలు అభివృద్ది కార్యక్రమాలు
*నియోజక వర్గంలో పర్యటించిన మంత్రి చందూలాల్

మన తెలంగాణ/ములుగు : తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి పర్యాటక, సాంస్కృతిక శాఖ మాత్యులు చందూలాల్ నియోజక వర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన  చేశారు. ములుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ములుగు నియోజక వర్గం నుండి వచ్చు వివిధ వర్గాల ప్రజలు  ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించి ముఖ్య పట్టణాలకు వెళ్లి వైద్యం చేసుకునే ప్రజలకు ఆటంకాలు కలుగుతున్నాయని అర్థం చేసుకుని ములుగు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో టిబి సెంటర్ ను ఏర్పాటుచేశారు. ఏరియా ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సులబ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి త్వరలో పూర్తి చేయాలని సంబందిత అధికారులకు తెలియపర్చారు. తద్వారా నియోజక వర్గంలోని పలు గ్రామలాకు ప్రజలకు ఇక్కడే అధ్న రకాల వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత వైద్యులచే పూర్తి చికిత్సలు అందించి వ్యాధి నయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు వృదా ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వ పరంగా అందించే వైద్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సంబంధిత మందులు కూడా తక్కువ ధరల్లో జనరిక్ మందుల షాపులో అందుబాటులో ఉంటాయని సూచించారు. వెంకటాపూర్ మండలంలోని గుర్రంపేట, బావుసింగ్ పల్లి, సుబ్బక్క పల్లి , రాం నాయక్ తండా, పెద్దాపూర్, వెంకటేశ్వర్ రావు, కొత్తపల్లి , అడవి రంగాపురం, లక్ష్మీందేవిపేట, లంబాడీ తండా, నర్సింగాపూర్, నల్లగుంట, హేమానాయక్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ది పనులను ఆయా గ్రామాల ప్రజలకు అంకితం చేస్తూ ప్రారంభించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి వెంకటాపూర్ మండలంలోని సుమారు 3.50 కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేసామని ఇట్టి పనులు తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు బంగారు తెలంగాణ లక్షంగా నా నియోజక వర్గాన్ని అభివృద్ది చేస్తున్నానని ఈ అభివృద్ది పనులను అన్ని పార్టీల నాయకులు అర్థఁ చేసుకోవాలని చేస్తున్న అభివృద్ది కళ్లారా చూడాలని విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు. ప్రజలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను చూసి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన సూచించారు.
ములుగు: రూరల్
తెలంగాణ రాష్ట్ర గిరిజనాభివృద్ది పర్యాటక, సాం స్కృతి శాఖ మాత్యులు ఆజ్మీరా చందూలాల్ శనివారం మండలంలోని మల్లంపల్లిలో సిసి రోడ్ల ప్రా రంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం జగ్గన్నపపేట ఆశ్రమ పాఠశాల నందు విద్యార్థుల నూతన వసతి గృహం ప్రారంబోత్సవంలో పాల్గొని ములుగు సబ్ కలెక్టర్ విపి గౌతమ్ కు విద్యార్థుల ఆవశ్యకత మేరకు వసతులను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటిచైర్మన్ డా. ఆజ్మీరా ప్రహ్లాద్, ఆయా మండలాల అద్యక్షులు గట్టు మహేందర్, హర్జీనాయక్, ఎంపిపి భూక్యా మంజుల మురళి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మంచోజు బ్రహ్మచారి, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments