Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

13,275 యేళ్ల జైలు

Police Attack on Cricket Betting Base

నలభై వేల మందిని తన మాటలతో బురిడీ కొట్టించి 11 కోట్ల 60 లక్షల డాలర్లు జేబులో వేసుకున్నందుకు ఒక మోసగాడికి 13,275 యేళ్ల జైలు శిక్ష విధించింది థాయ్‌లాండ్ కోర్టు. ఆ మాటల మరాఠీ పేరు పుదిత్ కిట్టిత్రాడిలోక్ (34). పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు కార్పొరేట్ కంపెనీలలాగా సెమినార్లు పెట్టేవాడు. తమ కంపెనీలలో పెట్టుబడిపెడితే రెట్టింపు సొమ్ము వెనక్కిస్తానని, ఇన్సెంటివ్‌లు ఇస్తానని నమ్మబలికేవాడు. రియల్‌ఎస్టేట్, బ్యూటీ ప్రొడక్ట్ తయారీ, సెకెండ్‌హ్యాండ్ కార్ల అమ్మకాలు, కొనుగోళ్ళు, విదేశాలకు సరుకు ఎగుమతుల వంటి పలు వ్యాపారాలు తనకున్నాయని చెప్పేవాడు. అది నమ్మి అమాయకంగా పెట్టుబడి పెట్టి దివాలా తీసిన వారు వేలల్లో ఉన్నారు. పుదిత్‌కు రెండు కంపెనీలకు మించిలేవు. అవీ అంత పెద్దగా వ్యాపారం చేసేవేం కావు. మోసం చేసినందుకు కంపెనీ సొమ్ము నుంచి 40 కోట్ల డాలర్లు చెల్లించాలని, తాము గుర్తించిన 2,653 మంది బాధితులకు 7.5% చొప్పున వడ్డీ కలిపి చెల్లించడానికి మరో కోటీ 70లక్షల డాలర్లు జమచేయాలని ఆదేశించింది. అలా కాని పక్షంలో 13,275 యేళ్ల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. అయితే 2,653 మంది కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించానని పుదిత్ అంగీకరించడంతో కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షాకాలాన్ని 6,637 సంవత్సరాలకు తగ్గించింది.

Comments

comments