Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జీవితానికి రెండు చుక్కలు

ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి, జిల్లా వైద్యాధికారి మల్లికార్జునప్ప
వనపర్తిలో పల్స్‌పోలియో అవగాహన ర్యాలీ

Puls-Polio

వనపర్తి: పసి పిల్లలను జీవచ్ఛవాలుగా మార్చి వారి బంగారు భవి ష్యత్తును నరక ప్రాయంగా చేసే పోలియో వ్యాధి నివారణకు పల్స్‌పోలియో జీవితా నికి రెండు చుక్కలే అని ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి, జిల్లావైద్యాధికారిమల్లికార్జునప్పలు అన్నారు శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహ్మారావు దేశంలో పోలియో రహి తంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా సంవ త్సరంలో రెండు పర్యాయాలు ఐదు సంవ త్సరాల్లోపు బాలబాలికలకు పోలియో చుక్కలను వేయించే కార్యక్ర మాన్ని మొదలు పెట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

1995 లో పల్స్‌పోలి యో కార్యక్రమంను చేపట్టి లక్ష సాధన దిశగా పయనించిందని 2000 సంవత్స రం నాటికి దేశంలో కేవలం 264 కేసులు మాత్రమే బయట పడ్డాయని , 2016 సంవత్సరం నాటికి దేశంలో పోలియో వ్యాధికి సంబందించి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం హర్షించదగ్గ విషయ మని ఆయన తెలిపారు. నిరక్షరాస్యత ప్రజల్లో వ్యాధిపట్ల నెలకొన్న అవగాహన కల్పించేందుకు ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 29,30,31తేదిల్లో నిర్వహించే పల్స్‌పోలి యో కార్యక్రమంలో 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికి తప్పకుండా పోలియో చుక్క లను వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ నర్సింహ్మారెడ్డి, డాక్టర్లు బిశ్రీనివాసులు, శ్రీనివాసులు, సాయిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, వైస్‌చైర్మన్ బి కృష్ణ, కౌన్సిలర్లువాకిటి శ్రీధర్, కృష్ణబాబు, భువనేశ్వరీ, విజయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments