Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

66 ఏళ్ల తర్వాత గోళ్లు కత్తిరింపుకు రెడీ…

World-bigsest-neils

పూణే: సాదరణంగా చాలా మందికి స్టైలిస్ గా గోళ్లు పెంచే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఓ వ్యక్తికి ప్యాషన్ గా మారింది. అది  కాస్తా ఆయనకు ప్రపంచ రికార్డులో చోటును సంపాదించి పెట్టింది. వివరాల్లోకి వెళితే…. ప్రపంచంలో అత్యంత పొడవైన గోళ్లతో ఓ వ్యక్తి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీధర్ ఛిల్లాల్ అనే వ్యక్తికి ప్రస్తుతం 82 ఏండ్లు.  అతను సుమారు 66 ఏండ్ల నుంచి తన గోళ్లను కత్తిరించుకోకుండా పెంచుతున్నాడు. కాగా, న్యూయార్క్‌లోని టైమ్ స్వేర్‌లో జరుగనున్న ‘నెయిల్ క్లిప్పింగ్ సెర్మనీ’లో ఛిల్లాల్ తన గోళ్లను కత్తిరించుకోబోతున్నడట. తన పెంచుకున్న గోళ్లను సజీవంగా మ్యూజియంలో ఉంచాలని అమెరికా ప్రాంఛైజీ సంస్థ ‘రిప్లెయిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌’ కు అతను కోరాడు. శ్రీధర్ ఛిల్లాల్ బొటనవేలు గోరు 197.8 సెంటీ మీటర్ల పొడవుండగా… మొత్తం గోళ్ల పొడవు 909.6 సెంటిమీటర్లు ఉన్నాయట. ఒకే చేతికి అత్యంత పొడవైన గోళ్లను పెంచుకున్న వ్యక్తిగా శ్రీధర్  2016 లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించాడు.

Comments

comments