Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

పుణె X ముంబయి

  • MI-vs-Pune
  • నేడు వాంఖడే వేదికగా క్వాలిఫయర్-1
  • 17న ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌తో కోల్‌కతా ఢీ
  • 19న క్వాలిఫయర్-2 మ్యాచ్
  • 21న ఫైనల్

ముంబయి ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)-10వ సీజన్‌లో ఇప్పటివరకూ రసవత్తరంగా సాగిన 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది జట్లు తమ బల బలాలను ప్రదర్శించగా నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్లిన ముంబ యి జట్టు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 20 పా యింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. చావోరేవోలా సాగిన ఆఖరి మ్యాచ్‌లో పుణె జట్టు పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. దీంతో 9 మ్యాచ్‌లు గెలిచి న పుణె 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఒక మ్యా చ్ రద్దుతో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించిన డిఫెండింగ్ ఛాంపియ న్ సన్‌రైజ ర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడ ర్స్ 16 పాయింట్లతో 4వ స్థానానికి పరిమితమైంది. దీంతో మొదటి వరుసలో 4 జట్లు నాకౌట్‌లో తలపడటానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపిఎల్ టైటిల్ ఏ జట్టు కైవసం చేసుకుంటుందా అని ఆసక్తి నెలకొంది. కాగా, ప్లేఆఫ్స్‌కు చేరిన ఈ నాలుగు సమవుజ్జీలే కావడంతో ఐపిఎల్-10 టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుందో ఫైనల్ మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.
టైటిల్‌పై కన్నేసిన ముంబయి..
ఐపిఎల్ 10 సీజన్ టైటిల్‌ను దక్కించుకునేందుకు ముంబయి ఇండియన్స్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా గత మ్యాచ్‌లో సొంతగడ్డపై పుణె చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌సేన ఎదురుచూ స్తోంది. అగ్రస్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు సొంత మై దానం వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగే క్వాలిఫయర్-1 లో రెండో స్థానంలో నిలిచిన పుణెతో తలపడనుంది. క్వాలిఫయర్-1 పోరులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో తర్వాతి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబా ద్, కోల్‌కతా జట్లు ఈ నెల 17న (బుధవారం) బెంగళూరు వేదికగా జరిగే ఎలిమినేటర్ పోరులో తలపడతాయి. అదేవిధంగా క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో ఈ నెల 19న (శుక్రవారం) బెంగళూరులో జరిగే క్వాలిఫయర్-2 లో తలడపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టుతో హైద రాబాద్ వేదికగా ఈ నెల 21న (ఆదివారం) ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుం ది. అనంతరం మే 22న రిజర్వ్ డే గా ప్రకటించగా, క్వాలిఫయర్స్, ఎలి మినేటర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేవు. కాగా, పేలవ ప్రదర్శనతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీడేర్‌డెవిల్స్, గుజరాత్ రాయల్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగ ళూరు నాలుగు జట్లు ఈ సీజన్‌లో తేలిపోయి నిరాశతో ఇంటిబాట పట్టా యి.
జట్లను తక్కువ అంచనా వేయలేం..
ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయలేమని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అద్భుత విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ముంబయి జట్టే ఐపిఎల్ 10 టైటిల్ విజేతగా నిలుస్తుందని సీనియర్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఆశా భావం వ్యక్తం చేశాడు. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌ల వరకు ఈ జట్లు ప్రదర్శించిన ఆటతీరుతో ఏ క్షణమైనా ఆట ఆస్తకికరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఐపిఎల్ 10 సీజన్‌లో పుణె కెప్టెన్‌గా పగ్గాలు అందు కున్న స్టీవ్ స్మిత్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో 420 పరుగులు సాధించి పుణెను రెండో స్థానంలో నిలిపాడు. స్మిత్‌తో పాటు రాణించిన రాహుల్ త్రిపాఠి ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో 388 పరుగులు సాధించి పుణె విజయాల్లో కీలక పాత్ర పోషించా డు.
‘ఆరెంజ్ క్యాప్’ జాబితాలో వార్నర్ అగ్రస్థానం
సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో అత్యధికంగా 604 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తరువాతి స్థానంలో వార్నర్ సహచర ఆటగాడు శిఖర్ ధావన్ 468 పరుగులతో నిలిచాడు. కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ 454 పరుగులతో ధావన్‌కు సమీపంలో మూడో స్థానంలో నిలిచాడు.

Comments

comments