Home వార్తలు బెంగాల్‌పై పుణెరి విజయం

బెంగాల్‌పై పుణెరి విజయం

kabaddiముంబయి : దీపక్ నివాస్ హుడా(13 సుర్జీత్(9 పాయింట్లు) సత్తాచాటడంతో తమ లీగ్ చివరి మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 43-19తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. బెంగాల్ రైడర్లు మహేంద్రరాజ్‌పుత్, మహేశ్‌గౌడ్‌లను పట్టేసి ఆరంభంలోనే 2-0తో ఆధిక్యం సాధించిన పుణెరి.. దీపక్‌నివాస్ అద్భుత రైడింగ్ ప్రథమార్థం ముగిసే సరికి 20-8తో నిలిచింది. ఇక ద్వితీయార్థంలోనూ బెంగాల్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వని పుణెరి 43-19తో గెలిచి సెమీస్‌కు చేరి మూడోస్థానంతో సెమీస్‌కు చేరింది. బెంగాల్ తరుపున మహేంద్రరాజ్‌పుత్(6), జంగ్‌లీ(4) మాత్రమే రాణించారు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యు ముంబా 36-20తో ఢిల్లీ దబాంగ్‌ను చిత్తుచేసింది. ఈ సీజన్‌లో దంబాంగ్‌కు ఇది 13వ విజయం. ఆడిన 14 మ్యాచ్‌ల్లో దబాంగ్ ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది.