Home జాతీయ వార్తలు కానిస్టేబుల్‌కు బంపర్ ప్రైజ్.. లాటరీలో రూ.2 కోట్లు

కానిస్టేబుల్‌కు బంపర్ ప్రైజ్.. లాటరీలో రూ.2 కోట్లు

Punjab Police constable

 

పంజాబ్ : చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా బాధ్యత బరువులో జీవిస్తున్న ఓ నిరుపేద కానిస్టేబుల్ కు లాటరీలో 2 కోట్లు బహుమతి రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. వివరాల్లోకి వెళితే… పంజాబ్‌లోని హోషియాపూర్‌, మోటియాన్‌ గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌కు తొమ్మిదేళ్ల క్రితం కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. చాలి చాలని జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బ్యాంకులో అప్పు చేసి ఉండడానికి ఓ ఇల్లు కట్టుకున్నాడు. కానీ వచ్చే జీతంలో ఎక్కువ మొత్తం రుణ బకాయిగానే పోతుండడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఓ రోజు విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ లాటరీ టికెట్టు కొనాంలంటూ ఓవ్యక్తి వచ్చాడు. తన అదృష్టాన్ని పరీక్షించించుకుందామని రూ.200 పెట్టి ఓ టికెట్‌ కొన్నాడు. ఆ తర్వాత ఆ టికెట్‌ను ఓ మూలన పడేసి మర్చిపోయాడు. తీరా ఓ రోజు పంజాబ్‌ ప్రభుత్వం నిర్వహించే లోహ్ రీ బంపర్‌-2019లో మీకు రూ.2 కోట్ల బహుమతి వచ్చిందని తెలియగానే ఆశ్చర్యపోయాడు. అప్పుడుగాని అతను లాటరీ టికెట్టు కొన్న సంగతి గుర్తుకురాలేదు. దీంతో ఇంటికి వెళ్లి మూలన పడేసిన టికెట్‌ ను వెతికి సరిపోల్చుకుని సంబరాల్లో మునిగిపోయాడు.

Punjab Police constable wins Rs 2 crore in lottery