Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

punjab
కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. కోల్ కతాపై 9 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్రిస్ లిన్(74), రాబిన్ ఊతప్ప(34), కెప్టెన్ దినేష్ కార్తిక్(43) రాణించారు.పంజాబ్ బౌలర్లలో స్రాన్ 2 వికెట్లు తీశాడు. రహ్మన్, టై, అశ్విన్ తలో వికెట్ తీశారు. అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్, గేల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో పంజాబ్ 8.2 ఓవర్లలోనే 96 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 13 ఓవర్లలో 125 పరుగులకు కుందించారు. సునీల బౌలింగ్‌లో రాహుల్(60)  ఔటైనా గేల్(62) 11.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలించాడు.

Comments

comments