Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జూ.ఎన్‌టిఆర్ రాజకీయాల్లోకి వస్తే సలహాదారుగా ఉంటా: పురుందేశ్వరి

జూ.ఎన్‌టిఆర్ రాజకీయాల్లోకి వస్తే సలహాదారుగా ఉంటా: పురుందేశ్వరి

 

అమరావతి: పార్లమెంట్ ఎన్నికలలో మాజీ మంత్రి పురందేశ్వరి విశాఖపట్నం నియోజకవర్గం నుంచి బిజెపి తరుఫున బరిలో దిగుతున్నారు. తన మేనల్లుడు రాజకీయం ఆరంగ్రేటం చేస్తే తాను సలహాదారుడి ఉండి సలహాలు ఇస్తానని ఆమె తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్‌టిఆర్‌కు సినిమాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, ఇప్పట్లో రాజకీయాలు వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వస్తే మాత్రం సహాయం చేస్తానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని గతంలో జూనియర్ చాలా సార్లు చెప్పాడని గుర్తు చేశారు. జూనియర్ ఎన్‌టిఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్‌టిఆర్ చిత్రాని తాను చూడలేదని, తాను లక్ష్మీ పార్వతిని కొట్టినట్లు సినిమాలో చూపించారని అందులో నిజం లేదని వెల్లడించారు. ఎన్‌టిఆర్ జీవితంపై ఎలా ఉందో చూడలనే కోరికతోనే ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిందన్నారు.

 

Purandeswari Response on Junior NTR Political Entry