Home తాజా వార్తలు ప్రతి ధాన్యం గింజనూ కొంటాం

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం

రాష్ట్రంలో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
3300 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
వరికి రూ. 1590 మద్దతు ధర: మంత్రి తన్నీరు హరీశ్‌రావు

Harish-Rao

మన తెలంగాణ/ జోగిపేట(సంగారెడ్డి) రాష్ట్రంలో రైతు లు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందు కోసం 3,300 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ, గిడ్డంగుల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో రైతు బజార్ నిర్మాణపు పనులను, వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక ఎ మ్మెల్యే బాబూమోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఉన్న నాలుగు ప్రాధానమైన నాగర్జుసార్, శ్రీరాంసాగర్, లోయర్‌మానేరు, పాలేరు, మూసి ప్రాజెక్టుల ద్వారా వ్య వసాయానికి నీరందించడంతో ఎకరాకు 40 బస్తాలు పండించే ప్రతి రైతు ఈ సారి 50 బస్తాల ధాన్యం పండించారన్నారు. ప్రస్తుతం వరికి క్వింటాళ్ళకు రూ.1590 మ ద్దతు ధరను ప్రకటించినట్లు ఆయన చెప్పారు. అయితే 24 శాతం తేమతో ఉన్నండకుండా 17 శాతం తెమతో ఉ న్న పంటను వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యంకు 48 గంటల్లోనే రైతు బ్యాంకు ఖాతలో డబ్బులను వేస్తామని దీన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పరిశీలిస్తారని వివరించారు. ఒక్క పంటకు రూ.200 కోట్ల విలువ గల పంటను పండితే 3 పంటలకు దాదాపుగా రూ.500 కోట్ల విలువగల పంట సంగారెడ్డిల్లా జోగిపేట ప్రాంత రైతులు పండించడం విశేషమన్నారు. ఎండకాలంలో సైతం కాల్వల ద్వారా వచ్చిన నీటితో చెరువులన్ని కళకళలాడుతున్నాయని అన్నారు. కాలేశ్వరం నుం డి సింగూరుకు నీటిని పంపించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తవుతున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ప్రతి పంటకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే ఎ మ్మెల్యే బాబూమోహన్ కృషితో తాలెల్మ గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం కోసం రూ.37 కోట్లు మంజూరు చేశామ ని, టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ పథ కం ద్వారా మరో 80 చెరువులకు నీటిని సరఫరా సాగుతుందని, కేవలం ఆరు నెలల్లో ఈ పనులు పూర్తిఅవుతాయని పేర్కొన్నారు. కాలేశ్వరం, మల్లన్నసాగర్ నుండి సింగూర్‌కు నీటి సరఫరాలో గ్రావీటి నీటి ద్వారా మరో 30 వేల ఎకరాలకు నిళ్లాందిస్తామని దీంతో అందోల్ నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతుందని చెప్పారు.
1100 డాక్టర్ పోస్టుల భర్తీ
వైద్యవిధాన పరిషత్ నేతృత్వంలో రాష్ట్రంలో 11 వందల డాక్టర్ పోస్టుల నియమకానికి రంగం సిద్ధంమైందని, డాక్టర్ల నియమకం త్వరలోనే పూర్తవుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియామక చర్యలు వైద్యశాఖ చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పి.బాబూమోహన్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి.నాగభూషణం, పట్టణ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చాపల వెంకటేశం, మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.