Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జోరుగా ధాన్యం కొనుగోళ్ళు

g

వరి ధాన్యం కొనుగోళ్ళు జోరందుకు న్నాయి. పిఎసిఎస్ హస్నాబాద్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు  కొలుగోలు కేంద్రానికి భారీగా ధాన్యం తరలివచ్చింది. గత నెల 27న ప్రారంభించిన ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 3వేల క్వింటాళ్ళ ధాన్యాన్ని సేకరించినట్లు అధికారి వెంకటేష్ తెలిపారు. రైతులకు ఏలాంటి ఇబ్బం దులు ఎదురవకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరి ంచిన వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.    -మన తెలంగాణ/కొడంగల్‌రూరల్

Comments

comments