Home హైదరాబాద్ వినాయక చవితి సందడి

వినాయక చవితి సందడి

Purchases of large scale Ganesha idols

పెద్ద ఎత్తున విగ్రహాల కొనుగోళ్ళు
మట్టి విగ్రహాలకంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలవైపే మొగ్గు

కిటకిటలాడుతున్న వినాయక విగ్రహాల షాపులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ ఉండడంతో నగరంలోని పలు వినాయక విగ్రహాల షాపులు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న సైజు మట్టి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా నివాస గృహాల్లో పూజకు అనుకూలంగా ఉండడమే కాకుండా నిమజ్జనం కూడా సులువుగా చేయవచ్చని భావించడంతో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. మరి కొద్ది మంది వినాయక విగ్రహాలను తయారు చేసేందుకు సమీపంలోని చెరువుల వద్ద నుంచి మట్టిని తీసుకు వచ్చి వినాయక ప్రతిమకు సంబంధించిన అచ్చులతో మట్టి విగ్రహాలను తయారు అమ్మకాలను కొనసాగిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు.
గత కొద్ది సంవత్సరాల నుంచి రంగు విగ్రహాలను కొనుగోలు చేయవద్దని వాటి ద్వారా వచ్చే చెడు ఫలితాలను ప్రభుత్వం వివరిస్తుండడమే కాకుండా హెచ్‌ఎండి,జిహెచ్‌ఎంసి వంటి డిపార్ట్‌మెంట్లు వాటిని ఉచితంగా అందిస్తున్నారు. అంతే కాకుండా మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాటిని ప్రజలకు ఉచితంగా అందచేస్తున్నాయి. ఇటు ప్రభుత్వ విభాగాలు, అటు స్వచ్ఛంద సంస్థలు గత కొద్ది సంవత్సరాలు రంగు విగ్రహాల కొనుగోళ్ళపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో రంగుల వినాయక విగ్రహాల కొనుగోళ్ళు కూడా క్రమేపి తగ్గుతున్నాయి.