Search
Wednesday 14 November 2018
  • :
  • :

మందకొడిగా పుష్కరఘాట్ పనులు

pushkagutuదేవరకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మ కంగా 12 నుండి ప్రారంభమైయ్యే కృష్ణాపుష్కరాల కో సం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయి ఏర్సాట్లు చేస్తున్నప్ప టికీ పుష్కరాల సమీపిస్తున్న కొద్ది పనులు మందకొడిగా సాగు తున్నాయి. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపూర్ వద్ద నూత నంగా పుష్కర ఘాట్‌ను 100 మీటర్ల మేర నిర్మిం చేందుకు రూ.2.07 కోట్లు వెచ్చించి పనులు చేపట్టింది. ఆజ్మాపూర్ పుష్కర ఘాట్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం నేటికి పూర్తి కాలేదు. మరోవైపు దేవాయలం నిర్మాణం ప నులు నేటికి జరుగుతున్నాయి. అజ్మాపూర్ ఘాట్‌కు భక్తు లు 20 వేల మంది వస్తారని అధికారులు అంచానా వేసి న్పటికి రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో చిన్నఅడి శర్లపల్లి నుండి అజ్మాపూర్ పుష్కర ఘాట్ వరకు నిర్మిస్తున్న డ బుల్ లేన్ రహదారులు పనులు మందకోడిగా సాగు తున్నాయి. ఇది ఇలా ఉండగా నాగార్జున సాగర్ రిజ ర్వాయర్ పూర్తి స్థాయి సమార్థంలో నీరు నిల్వ ఉంటే తప్ప పుష్కర ఘా ట్‌కు నీరు చవ్చే అవకాశం లేదు. చం దంపేట మండలం పెద్దమునిగల్ శాశ్వత ప్రాతి పాధికన పుష్కర ఘాట్‌ను 120 మీటర్ల పొడవు రూ.4.06 కోట్ల అంచనా వ్యయం తో నిర్మాణ పనులను చేపట్టింది.పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి స్థాయి కాలేదు.భక్తులు దుస్తువులు మార్చుకునేందుకు ఏర్పాటు చే స్తున్న గదులు పూర్తి కాలేదు.మరుగుదొడ్లు శాశ్విత ప్రాతిపాదిక నిర్మి ంచేవి పూర్తి కాలేదు.తాత్కాలిక మరు గుదొడ్లు ఏర్పాటు పూర్తి కాలేదు.కాచరాజుపల్లి పుష్కర్ ఘాట్ వద్ద 80 మీటర్ల ఘాట్ నిర్మాణం కోసం రూ.1.28 కోట్టు వెచ్చించి ఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికి భ క్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాచరాజుపల్లి, పెద్దమునిగల్ ఘాట్‌లకు భక్తులకు వచ్చేందుకు తిమ్మాపూర్ నుండి కాచరాజుపల్లి వరకు నిర్మిస్తున్న డబుల్ లేన్ రహదారులు నేటికి పూర్తి కాలేదు.హైద్రాబాద్ నుండి నాగార్జున సాగర్ వరకు నిర్మింస్తున్న రహదారి విస్తరణ పనులు పూర్తి కాలే దు. శేరిపల్లి నుండి దేవరకొండ వరకు,పడ్మట్‌పల్లి నుండి డిండి వరకు,తవక్లాపూర్ నుండి చెర్కుపల్లి వరకు,డిండి నుండి దేవరకొండ,చెన్నంనేనిపల్లి నుండి కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రహదారుల పనులు పూర్తి కాలేదు.డబుల్ లేన్ రహ దారుల సంగతులేమో కాని ఉన్న రహదారులు పూర్తి గా త్రవ్వి వేయడంతో తిమ్మా పూర్, కొత్తపల్లి, నేరడుగొ మ్ము, పెద్దమునిగల్, చినము నిగల్, కాచరాజుపల్లి, అజ్మా పూర్, పెండ్లిపాకల, పేర్వాల, చెన్నంనేనిపల్లి గ్రామా ల ప్రజలకు రహదారులు లేకుండా పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుష్కర్ ఘాట్ ప నులు 90 శాతం పూర్తి అయ్యా యని అధికారులు ప్రకటి ంచినప్ప టికి వాస్తవ పరిస్థితి భిన్నంగాఉంది. కాచరా జుపల్లి నుండి రిజర్వాయర్ దాదాపు 2 కిలోమీటర్ల దూర ంలో కృష్ణా బ్యాక్‌వాటర్ ఉంది. పెద్దమునిగల్‌కు 4 కిలో మీటర్ల దూ రంలో, జ్మాపూర్ ఘాట్‌కు 6 కిలోమీటర్ల దూ రంలో కృష్ణా బ్యాక్‌వాటర్ ఉంది. భక్తులు స్నానాలు చేసే అవకాశం లే దు.నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థం ఉంటేనే పుష్కర ఘాట్‌లకు నీరు వచ్చే అవకాశం ఉంది.కాని రిజర్వాయర్ నిండ కుంటే ప్రత్యాన్మయంగా షవర్ స్నానాలే భక్తులకు దిక్కుగా మారనున్నాయి.

Comments

comments