Home మహబూబ్‌నగర్ అనుమానంతోనే అంతమొందించారు

అనుమానంతోనే అంతమొందించారు

Put an end up with suspicion

ఎస్‌పి డాక్టర్ బి.అనురాధ

రంజాన్‌కానుకగా ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ..
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ క్రైం: గత నెల 30న కోస్గి మండల కేంద్రంలో హత్యా కేసును పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే నెపంతోఈ హత్యను చేసినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటయ్య తన భార్య జయమ్మ గన్నోజీ రాముతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు ఎస్‌పి డాక్టర్ బి. అనురాధ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మృతుడు రాము గత నాలుగేళ్ల నుంచి వాసన్ అనే సంస్థలో నాలుగేళ్లుగా పని చేస్తున్నాడని, ఇదే సంస్థలో జయమ్మ అనే కంప్యూటర్ ఆపరేటర్‌గా రెండేళ్లుగా పని చేస్తున్నారని ఆమె తెలిపారు. జయమ్మకు , గన్నోజీ రాముకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతని స్నేహితుడై కురుపల్లి శాంతి, నర్సింహులుకు తెలిపి హత్య కోసం పథకం వేశారు. ఈ క్రమంలో హత్య చేసే రోజు నర్సింహులు తనకు పని ఉందని వెళ్లిపోగా వెంకటయ్య, కురుపల్లి శాంతి ఇద్దరు కలిసి వేటకొడవళ్లతో దారుణంగా హత్యచేశారు. నిందితుల నుంచి రెండు వేడకొడవళ్లు, రెండు మోటార్ సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్‌పి తెలిపారు. సమావేశంలో నారాయణపేట ఎస్‌పి, సిఐలు పాల్గొన్నారు.