Home ఆంధ్రప్రదేశ్ వార్తలు టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా రాజీనామా

టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా రాజీనామా

Putta Sudhakar Yadav

 

మన తెలంగాణ /తిరుమల: టిటిడి చైర్మన్ పదవికి ఎట్టకేలకు పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం రాజీనామా చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు ఈ మేరకు పుట్టా సుధాకర్ యాదవ్ తన రాజీనామా లేఖను పంపించారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా కొనసాగుతున్న మరికొంతమంది ఇప్పటికే తమ రాజీనామాలను సమర్పించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే గౌరవంగా నామినేటెడ్ పదవులతో పాటు టిటిడి చైర్మన్ గా తప్పుకోవాల్సిన మైదుకూరు టిడిపి నాయకులు పుట్టా సుధాకర్ యాదవ్ అందుకు విరుద్ధంగా తాను రాజీనామా చేయబోనని తొలుత ప్రకటించారు. దేవుడిచ్చిన అవకాశం కావున టిటిడి చైర్మన్ గా తనంతట తానుగా రాజీనామా చేయబోనని ప్రకటించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నామినేటెడ్ పదవులు అన్నింటితో పాటు టీటీడీ పాలకమండలి నియామకాలన్నీ రద్దు చేస్తూ ఈ మేరకు జీవో జారీ చేయాల్సి వచ్చింది. మరో రెండు రోజుల్లో టీటీడీ నూతన చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో అకస్మాత్తుగా మెడపట్టి బయటకు గెంటి పరిస్థితి రాకుండా రెండు రోజులు ముందు అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా లేఖ ప్రకటించడం గమనార్హం.

Putta Sudhakar Yadav resigns to TTD chairman post