Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సింధు సంచలనం…

PV Sindhu in Asian Games Badminton final

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పివి సింధు బ్యాడ్మింటన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అలవొకగా గెలిచిన సింధు రెండో సెట్‌ను మాత్రం 15-21తేడాతో కోల్పోయింది. మూడో సెట్‌లో యమగుచికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తొలి నుంచే తనదైన ఆటతో చెలరేగిపోయిన సింధు 21-10 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో వరల్డ్ టాప్ సీడెడ్, చైనీస్ తైపె ప్లేయర్ తై జు యింగ్‌తో సింధు తలపడనుంది. కాగా, మరో భారతస్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీస్‌లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

Comments

comments