Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఫోర్బ్స్ ఏడో స్థానంలో సింధు

PV Sindhu in top-10 player from India

అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణీల జాబితా విడుదల

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణీల జాబితాను ప్రకటించింది. ఇందులో పి.వి. సింధు ఏడో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం. అంతేకాదు టెన్నిస్ క్రీడాకారిణులు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో టాప్-10లో నిలవగా, అందులో సింధు ఉండటం మరో విశేషం.

అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సెరెనా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి. గత ఏడాది బిడ్డకు జన్మనివ్వడం వల్ల కొంతకాలం టెన్నిస్‌కు దూరమైన సెరెనా ఈ ఏడాది మార్చిలో తిరిగి ఆడటం మొదలుపెట్టింది. టోర్నీలు ఆడటం ద్వారా అం దుకునే ప్రైజ్‌మనీ, వాణిజ్య ఒప్పందాల ద్వారా వీరు అందుకునే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను తయారు చేసింది.

Comments

comments