Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సింధుకి కెరీర్ బెస్ట్ ర్యాంక్

PV-Sindhu

హైదరాబాద్: బిడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానమే తన లక్ష్యమని ప్రకటించిన భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ రజత పతకం విజేత పి.వి.సింధు ఆ దిశగానే పయనిస్తోంది. తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్ ఐదు సాధించింది. మరో హైదరాబాద్ స్టార్ సైనా నెహ్వాల్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.గత ఏడాది ఇదే సమయానికి సింధు 12వ ర్యాంకులో ఉండగా, సైనా రెండో ర్యాంకులో ఉండటం గమనార్హం. ఇక మొదటి నాలుగు స్థానాల్లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), కరోలినా మారిన్ (స్పెయిన్), హ్యున్ సంగ్ (కొరియా), సున్ యు (చైనా) తొలి ఉన్నారు.

Comments

comments