Home తాజా వార్తలు సింధు, శ్రీకాంత్ ఇంటికి

సింధు, శ్రీకాంత్ ఇంటికి

 PV Sindhu knocked out by China He Bingjiao in quarters

చైనా ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరాటం

ఫుజౌ(చైనా): ప్రతిష్టాత్మకమైన చైనా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత పోరాటం ముగిసింది. సింగిల్స్ పోటీల్లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవని సింధు, శ్రీకాంత్‌లు చైనా ఓపెన్‌లోనూ నిరాశ పరిచారు. ఈ ఇద్దరు నిష్క్రమించడంతో చైనా ఓపెన్‌లో భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 1721, 2117, 1521 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌జియావో చేతిలో ఓటమి పాలైంది. ప్రారంభంలో సింధు బాగానే ఆడింది. అయితే కీలక సమయంలో ఒత్తిడికి గురయ్యే బలహీనత వల్ల ఈసారి కూడా పరాజయం చవిచూసింది. తొలి సెట్ ప్రారంభంలో సింధు ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. కానీ, కీలక సమయంలో చైనా క్రీడాకారిణి పుంజుకుంది. సింధుపై ఎదురుదాడి చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో సెట్‌ను గెలుచుకుని పైచేయి సాధించింది. కానీ, రెండో సెట్‌లో భారత స్టార్ సింధు పుంజుకుంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసింది. సింధు చెలరేగి పోవడంతో ప్రత్యర్థి షట్లర్‌కు పరాజయం తప్పలేదు. అయితే ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో గేమ్‌లో సింధు మళ్లీ తడబడింది. ప్రత్యర్థి జోరును పెంచడంతో సింధుకు ఇబ్బందులు తప్పలేదు. చివరి వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన బింగ్‌జియావో అలవోకగా సెట్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.
శ్రీకాంత్ ఔట్..
ఇక, పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. చైనీస్‌తైపి క్రీడాకారుడు చౌటిన్ చెన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ 1421, 1421 తేడాతో ఓటమి చవిచూశాడు. తైపి క్రీడాకారుడు ప్రారంభం నుంచే ఆధిపత్యం చెలాయించాడు. చూడచక్కని షాట్లతో శ్రీకాంత్‌ను ఒత్తిడికి గురి చేశాడు. ప్రత్యర్థి ఆటగాడు చెలరేగి ఆడడంతో శ్రీకాంత్ ఎదురు నిలువలేక పోయాడు. దూకుడుగా ఆడిన చెన్ అలవోకగా తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ ప్రారంభంలో కాస్త పైచేయి సాధించినట్టు కనిపించిన శ్రీకాంత్ తర్వాత చేతులెత్తేశాడు. వరుస తప్పిదాలకు పాల్పడడంతో ప్రత్యర్థికి ఎదురు లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న చెన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. శ్రీకాంత్ ఓటమితో చైనా ఓపెన్‌లో భారత పోరాటానికి తెరపడింది.

నిరాశే మిగిల్చారు..

 PV Sindhu knocked out by China He Bingjiao in quarters

ఈ సీజన్‌లో భారత షట్లర్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. కిందటి ఏడాది వరుస టైటిల్స్‌తో హోరెత్తించిన కిదాంబి శ్రీకాంత్ ఈసారి ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. సింధు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇటు సింధు, అటు శ్రీకాంత్‌లు పేలవమైన ప్రదర్శనత నిరాశే మిగిల్చారు. సింధు ఒకటి రెండు సార్లు ఫైనల్‌కు చేరినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో ఓడే బలహీనతను మరోసారి పునరావృతం చేసి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కిందటి సీజన్‌లో సింధు, శ్రీకాంత్‌లు అద్భుత ప్రదర్శనతో భారత ఖ్యాతిని ఇనుమడింప చేశారు. శ్రీకాంత్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఏకంగా ఐదు టైటిల్స్ సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించాడు. కానీ, ఈ ఏడాది కనీసం ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. దీన్ని బట్టి శ్రీకాంత్ ప్రదర్శన ఎంత పేలవంగా సాగిందో ఊహించుకోవచ్చు. సింధు, శ్రీకాంత్‌లే కాకుండా సైనా నెహ్వాల్, హెచ్.ఎస్.ప్రణయ్‌లు కూడా నిరాశ పరిచారు. వీరిద్దరూ కూడా ఈ ఏడాది ఒక్క టైటిల్‌ను గెలవలేదు. ఇలా ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసిస్తారని భావించిన భారత షట్లర్లు ఒక్క టైటిల్ కూడా గెలవకుం డా ఆశలపై నీళ్లు చల్లారు. చైనా ఆధిపత్యం తగ్గి నా తైపి, కొరియా, స్పెయిన్, జపాన్, ఇండోనేషియా, మలేషియా, డెన్మార్క్ షట్లర్లు వరుస టైటిల్స్‌తో హోరెత్తిస్తున్నారు. భారత స్టార్లు మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే బ్యాడ్మింటన్‌లో భారత ప్రతిష్ఠ దిగజారడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 PV Sindhu knocked out by China He Bingjiao in quarters

Telangana Latest News