Home తాజా వార్తలు సెమీస్ లో సింధు..

సెమీస్ లో సింధు..

PV Sindhu progresses to semifinals of Thailand Open

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో ప్రవేశించింది. ఆరంభం నుంచి దూకుడిగా ఆడిన సింధు ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 36 నిమిషాల్లోనే విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో రెండో సీడ్ సింధు 21-17,21-13 తో వరల్డ్ నెంబర్ 35 సోనియా చెహ్(మలేషియా)పై విజయం సాధించింది.