Home తాజా వార్తలు క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్

PV Sindhu, Srikanth reach quarter finals of China Open

పుజౌ: భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు ప్రతిష్టాత్మకమైన చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు థాయిలాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో మరో తెలుగుతేజం శ్రీకాంత్ జయకేతనం ఎగుర వేశాడు. రెండో రౌండ్‌లో శ్రీకాంత్ ఇండోనేషియా ఆటగాడు టామీ సిగియార్టోను ఓడించాడు. మహిళల విభాగంలో సింధు అలవోక విజయాన్ని అందుకుంది. బుసానన్‌తో జరిగిన పోరులో సింధు 2112, 2115తో సునాయాస విజయం సాధించింది. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సింధు ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు.

చూడచక్కని షాట్లతో అలరించిన సింధు రెండు గేమ్‌లను కూడా సునాయాసంగా దక్కించుకుంది. మరోవైపు శ్రీకాంత్ చెమటోడ్చి విజయం సాధించాడు. సిగియార్టోతో జరిగిన పోరులో శ్రీకాంత్ 1021, 219, 219తో జయభేరి మోగించాడు. తొలి సెట్‌లో శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. ప్రత్యర్థి ఆటగాడు దూకుడుగా ఆడి శ్రీకాంత్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని ధాటికి శ్రీకాంత్ ఎదురు నిలువలేక పోయాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన సుగియార్టో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, తర్వాతి సెట్ నుంచి శ్రీకాంత్ పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

PV Sindhu, Srikanth reach quarter finals of China Open

Telangana Latest News