Home తాజా వార్తలు బోనమెత్తిన సింధు…

బోనమెత్తిన సింధు…

PV Sindhu Visits Lal Darwaza Mahankali Temple with Bonam

హైదరాబాద్: ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పివి సింధు ఆదివారం బోనమెత్తారు. సికింద్రాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ఆమె బోనం సమర్పించారు. ఇవాళ ఉదయం సింధు దేవాలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. ఆ తర్వాత ఆమె ప్రత్యేక పూజలు చేశారు. బోనం సమర్పించేందుకు ఆలయానికి వచ్చిన సింధుకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. సింధు ఆలయానికి విచ్చేసిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక నగర వ్యాప్తంగా బోనాలు జోరుగా కొనసాగుతన్న సంగతి తెలిసిందే.