Home తాజా వార్తలు దేశ, రాష్ట్ర గౌరవాన్ని సింధు నిలబెట్టింది: నాయిని

దేశ, రాష్ట్ర గౌరవాన్ని సింధు నిలబెట్టింది: నాయిని

NAYANIహైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ విజేత పివి సింధు సన్మాన కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ… దేశ, రాష్ట్ర గౌరవాన్ని సింధు నిలబెట్టిందన్నారు. రాష్ట్ర గౌరవాన్ని చాటిన ఆమెకు తానో పెద్ద అభిమానిగా మారిపోయనన్నారు. సింధు రాబోయే క్రీడల్లో స్వర్ణ పతకం గెలువాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.