Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రోగులకు నాణ్యమైన వైద్యం

hospital
మనతెలంగాణ /
ఆదిలాబాద్‌టౌన్:
రోగులకు నాణ్యమై, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డి.దివ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లోని పలు వార్డులను ఆమె పరిశీలించారు. రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో వైద్యం అందుతున్న తీరును రోగులను పరామర్శించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్‌లో రోగులకు నాణ్యమైన వైద్యవలు అందించడం, పలు వైద్యుల కొరత ఉందని తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. త్వరలో రిమ్స్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు రిమ్స్ డైరెక్టర్ చాంబర్‌లో రోగులకు సేవలు, పారిశుద్ధం, సెక్యూరిటీ తదదితర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ టెండర్ ద్వారా ఎంపికకు కమిటీ సమావేశం జరిగింది. సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని, త్వరలో కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆమెతో పాటు జేసీ కృష్ణారెడ్డి, రిమ్స్ డైరెక్టర్ అశోక్, డీఎంహెచ్‌వో రాజీవ్ రాజ్, రిమ్స్ వైద్యులు ఉన్నారు.
వేతనాలు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి…
గత ఐదు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఈ విషయంలో డైరెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని రిమ్స్ పారిశుద్ధ కార్మికులు జిల్లా కలెక్టర్ దివ్యకు ఏఐటీయూసీ రిమ్స్ విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. రిమ్స్ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌కు పారిశుద్ధ్య కార్మికు లు తమ సమస్యను కలెక్టర్ వివరించారు. పలు మార్లు వేతనాల కోసం అధికారులకు వెడుకున్న పట్టించుకోవడం లేదని అన్నా రు. దీనిపై కలెక్టర్ స్పందిస్తు పది రోజుల్లో వేతనాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు రిమ్స్ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు సిర్ర దేవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అనసూయ, ప్రధాన కార్యదర్శి దేవిదాస్, మణెమ్మ పాల్గొన్నారు.

Comments

comments