Search
Wednesday 21 November 2018
  • :
  • :

స్వార్థ రాజకీయాల కోసమే కొలవుల కొట్లాట

man2

జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్

మన తెలంగాణ/సిర్పూర్(యు)   ఆయన రాజకీయ పదవి కోసమే కొలవుల కొట్లాట సభలు నిర్వహిస్తున్నాడని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్ అన్నారు. ఆదివారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలతో చీకటి ఒప్పందం చేసుకుని కోదండరాం తెలంగాణలోని నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణలోని నిరుద్యోగ వృద్ధిరేటు కేవలం 2.7 మాత్రమే ఉన్న విషయం కోదండరాంకు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షా 12 వేల ఉద్యోగాలు గుర్తించి వరుసగా నోటిఫికేషన్‌లు జారి చేస్తుంటే అనవసరపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుతున్నారని యాదవ్‌రావ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి  నిరుద్యోగ రేటును తగ్గించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సెక్టార్‌తో పాటు ప్రైవేటు సెక్టార్‌లో కూడా ఉద్యోగాలు పెరుగుతుంటే కాంగ్రెస్ నేతలతో పాటు కోదండరాం లాంటి వాళ్ళకు కళ్ళుండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలను వదలి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కలసి రావాలని సూచించారు.

Comments

comments