Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సమాచార చట్టంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు

Information-Act

మన తెలంగాణ/హిమాయత్‌నగర్: దేశంలో ఎక్కువగా సమాచారాన్ని అందించేది మీడియా మాత్రమేనని జర్నలిజం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేది సమాచార హక్కు చట్టమని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడ భూషి శ్రీధర్ తెలిపారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమాచార హక్కు వికాస సమితి రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, సమాచార హక్కుపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. గత రెండేళ్ళ కాలంలో సమాచార హక్కు పై ఇప్పటికి వంద వ్యాసాలు రాయడం జరిగిందన్నారు. నాడు జర్నలిస్టులపై దాడులు జరిగేవని ప్రస్తుతం సమా చారం అడిగిన వారిపై దాడులు జరుగుతున్నాయని అం దోళన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం క్రింద ప్రశ్నలు అడిగేవారు వ్యూహత్మకంగా ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవులు ప్రజా జీవనం నుండి వచ్చిన వారికి సమాజ వృత్తిలో ఉన్న వారికి మాత్ర మే ఇవ్వాలని ఇందుకోసం పోరాడాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించిన రోజే దేశానికి నిజమైనా స్వా తంత్య్రం వచ్చి నట్లు అని నాడు మహాత్మగాంధీ అన్నారని వారి కలలు నిజమైనా రోజే ఈ చట్టం అమలు అవు తున్నట్లు అని అన్నారు.  సమితి గౌరవ అధ్యక్షులు కాచం సత్య నారా య ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టరు పిజె సుధాకర్,వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి సమితి సభ్యులు లక్ష్మణ్, విద్యా సాగర్, సిహెచ్ పవన్ కుమార్, మహేందర్, మధుబాబు పాల్గొన్నారు.

Comments

comments